గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ)కు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులను గుర్తించి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించి, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ కోరారు. ఈ మేరకు జిల్లా వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. బందగీ సాహెబ్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా వీఆర్‌ఏలకు జీతాలు పెరగలేదని, వెంటనే పే స్కేలు అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, డీఆర్‌ఓ అద్దెయ్యతో మాట్లాడి వీఆర్వో ప్రమోషన్ల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంఘం సత్తెనపల్లి, అమరావతి, నకరికల్లు, చిలకలూరిపేట, రొంపిచర్ల మండల అధ్యక్షులు రవి, రాజు, కాసులు, ఆనంద్ కుమార్, జీవమణి, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


