నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 154 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 38 అర్జీలను జాయింట్ కలెక్టర్ సంజనా సింహ స్వీకరించారు. నరసరావుపేట డివిజన్ నుంచి 21, సత్తెనపల్లి నుంచి 14, గురజాల నుంచి మూడు అర్జీలను బాధితులు అందజేశారు. భూసమస్యలు, గృహ హింస, అధికారుల చేతివాటం, ప్రభుత్వ పథకాలు అందలేదంటూ తదితర సమస్యలపై అర్జీదారులు అర్జీలు అందజేశారు. డీఆర్‌ఓ అద్దెయ్య, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, మూడు డివిజన్లకు చెందిన ఆర్‌డీఓలు అర్జీల స్వీకరణలో పాల్గొన్నారు.


