ఇంటి లెక్క తేలుద్దాం | - | Sakshi
Sakshi News home page

ఇంటి లెక్క తేలుద్దాం

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

ఇంటి లెక్క తేలుద్దాం సత్తెనపల్లి: జిల్లాలో 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ● జనాభా లెక్కల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు లేకపోవడం, ఉద్యోగ, వ్యాపార రీత్యా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఈసారి కొత్తగా స్వీయ జన గణనకు అవకాశం కల్పించింది. డిజిటల్‌ సెన్సెస్‌లో భాగంగా ప్రజలు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ● జనాభా లెక్కింపు అధికారులు ఇంటి వద్దకు రాకముందే ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఏపీలో స్వీయ గణనకు ఈనెల 16 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంది. స్వీయ గణన కోసం httpr://re.cenrur.gov.i n వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రాష్ట్రాన్ని సెలెక్ట్‌ చేసుకుని క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్‌ నెంబరు ధ్రువీకరించాలి. భాషను ఎంపిక చేసుకొని ఓటీపీ నమోదు చేయాలి. లొకేషన్‌ వివరాలను నమోదు చేశాక కుటుంబానికి సంబంధించిన వివరాల గురించి 33 ప్రశ్నలకు సమాధానాలు నింపాలి. ఇందులో సొంత ఇల్లు ఉందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఎల్‌పీజీ గ్యాస్‌ వాడుతున్నారా? కారు లేదా బైక్‌ ఉందా లాంటి ప్రశ్నలు ఉంటాయి. అన్ని వివరాలను నమోదు చేశాక ఒకసారి ప్రివ్యూ చూసుకొని ఫైనల్‌ సబ్మిషన్‌ బటన్‌ నొక్కాలి. 11 అంకెల సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ జనరేట్‌ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎన్యూమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ నెంబర్‌ చెబితే సరిపోతుంది. ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు, మార్పులు ఉంటే ఎన్యూమరేటర్‌ సమక్షంలో సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

‘జనగణన’కు కసరత్తు

మే 31 వరకు మొదటి దశ ‘గృహగణన’

రెండో దశలో జనాభా లెక్కల సేకరణ

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో

శిక్షణ పూర్తి

డిజిటల్‌ పద్ధతిలో వివరాల

నమోదు ప్రక్రియ

జిల్లా జనాభా 20.41 లక్షలు

స్వీయ గణన..

ఎలా నమోదు చేయాలంటే...

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారం

Advertisement
 
Advertisement
Advertisement