మాచర్ల: అక్రమ కేసులో 99 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై విడుదలైన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మాచర్లల్లోని పీఆర్కేను ఆయన స్వగృహంలో కలిసి సత్కరించారు. ఆయన వెంట కొమ్మినేని వెంకటేశ్వర్లు, పలువురు నాయకులున్నారు.
కాకుమాను నాగలక్ష్మి, భువనగిరి సంధ్య
గురజాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతుగా ఉంటున్నామనే కుట్రతోనే తన కుటుంబ సభ్యులను చంపివేశారని కాకుమాను నాగలక్ష్మి, భువనగిరి సంధ్యలు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గురజాల మండలానికి చెందిన కాకుమాను భవనారుషి, అతని సోదరుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి, అడిగొప్పల కాలువలో పడేసిన విషయం విధితమే.. దీనిపై బుధవారం మృతుల కుటుంబ సభ్యులు చర్లగుడిపాడులో మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులను భయపెట్టి వైఎస్సార్ సీపీకి మద్దతు ఇవ్వకుండా చూడాలనే ఆలోచనతోనే కాకుమాను భవనారుషిని, భువన గిరి శ్రీనులను చంపేసి అడిగొప్పల కాలువలో పడవేశారన్నారు. అతికిరాతకంగా క్రూరంగా చంపి కాలులో పడవేస్తే కనీసం మృతదేహాలు వేతకడానికి ఒక్కరూ కూడా సహాయం లేదన్నారు. తాము వైఎస్సార్ సీపీ కార్యకర్తలం కావడంవల్ల, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినవారం కావడం వల్లే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని తమకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని వేడుకొన్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేసేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తాడేపల్లిరూరల్(మంగళగిరి): రడగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై అనర్హత వేటు వేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ డిమాండ్ చేశారు. తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండలోని ఐద్వా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజకీయ నాయకులకు ఒక న్యాయం... సామాన్యులకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరించారని బోస్ ఘోష్ విమర్శించారు. దేశంలో గంజాయి మాఫియాను అరికట్టేందు కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చే పట్టాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, సీనియర్ నాయకురాళ్లు ఎస్.పుణ్యవతి, వై.సత్యవతి, డి.రమాదేవి, దొంతిరెడ్డి శ్రీనివాస్ కుమారి పాల్గొన్నారు.


