న్యూస్‌రీల్
మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో కొనుగోలు చేసే చోట అరకిలోతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలను అదుపు చేయాల్సిన సర్కారు గుడ్లప్పగించి చూస్తోందని మండి పడుతున్నారు. పాలకుల తీరుతో కట్టడి చేయాల్సిన అధికారులూ చోద్యం చూస్తున్నారు. కొందరు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు.
పల్నాడు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.5448 టీఎంసీలు.
7


