నాదెండ్ల: తన తల్లి అన్నమ్మ అనాధలు, పేదలను ఆదుకుంటూ వారికి తల్లిగా నిలిచి ఆదర్శవంతంగా జీవించారని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు చెప్పారు. తన స్వగ్రామమైన తూబాడులో తన తల్లి అన్నమ్మ రెండో వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి అన్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నరసరావుపేటకు చెందిన వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఎ.రామలింగారెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కె.జగన్‌మోహన్‌రెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, ఒ.శేషిరెడ్డి, పి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌డీ అబ్బాస్, హిమనిరెడ్డి, చంద్రకిరణ్‌రెడ్డి, జయబారత్‌రెడ్డి, చెంచిరెడ్డి, వై.నవీన్, వై.గాయత్రీ, ఎం.వసంత, చెన్నారెడ్డి, డి.వసంత హాజరయ్యారు. సుమారు 400 మందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం పలువురు రోగులను పరీక్షించి వైద్యసేవలందించారు. సుమారు 60 మందిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కాసు బ్రహ్మానంరెడ్డి, కాసు వెంగళరెడ్డి, తలతోటి ఛార్లెస్ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు.
తూబాడులో అన్నమ్మ రెండో వర్ధంతి
నివాళులర్పించిన ప్రముఖులు
మెగా వైద్య శిబిరంలో
400 మందికి ఉచిత వైద్య సేవలు


