కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సభ్యుడిగా ‘కొత్తూరి’ గుంటూరు మెడికల్‌: బీజేపీ సీనియర్‌ నాయకుడు కొత్తూరి వెంకట సుబ్బారావు జాతీయస్థాయిలో బోర్డ్‌ నెంబర్‌ స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సభ్యుడిగా నియమితులైన సందర్భంగా సోమవారం మిత్ర బృందం, వ్యాపార వర్గంలోని ట్రేడర్స్‌, ఎక్స్‌పోర్ట్స్‌, పార్టీ నాయకులు అభినందించారు. స్థానిక స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకులు నేరెళ్ల మాధవరావు అధ్యక్షత వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పార్టీ సేవను గుర్తించి స్పైసెస్‌ బోర్డ్‌ సభ్యుడిగా నియమించడం అభినందనీయమన్నారు. జాతీయ మిర్చి ఎక్స్‌పోర్ట్స్‌ కార్యదర్శి తోట రామకృష్ణ మాట్లాడుతూ అధికంగా రసాయన మందులు వాడం వల్ల మిర్చి పంటకు గిరాకీ తగ్గుతోందన్నారు. 28 శాతం స్పైసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ నుంచి 40 శాతం పెంచుకోగలిగితే గుంటూరు చరిత్రలో ఆర్థికంగా దేశంలో మొదటి స్థానంలో రాగలుగుతుందన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ కొత్తూరికి పదవి తమకు గర్వకారణమన్నారు. యడ్లపాటి రఘునాథబాబు మాట్లాడుతూ తాము ఇరువురు జిల్లా అధ్యక్షులుగా పోటీపడి పార్టీని అభివృద్ధి చేశామన్నారు. కొత్తూరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు ఆర్థికమైన లబ్ధి పొందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. టుబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌ కిషోర్‌, మిర్చి ఎక్స్‌పోర్ట్‌ కొత్తూరి సుధాకర్‌, జగదీష్‌ బండారి, వ్యాపారులు లీలాధర్‌ బూబ్‌, శార్వాణి అధినేత పెద్దిరెడ్డి గోపాల రెడ్డి, బీజేపీ కిసాన్‌ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, రాష్ట్ర అధికార ప్రతినిధి బాజీ, పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇన్‌చార్జ్‌, ఏపీ బార్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్‌ పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్‌సీ సెంటర్‌కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్‌ టెండర్‌ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్‌), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్‌ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్‌), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్‌కుమార్‌), ఆలయం వద్ద సంచారంగా ఐస్‌క్రీమ్‌ విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్‌ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్‌ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్‌), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్‌ హక్కును పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement