నరసరావుపేట రూరల్: భూ, ఆస్తి వివాదాలు, ఆర్థిక అంశాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
కన్న కొడుకు నుంచి ప్రాణ హాని ఉంది
తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి బాలరాజు జిల్లా ఎస్పీని కోరారు. గతంలో తాను ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేసినట్టు తెలిపాడు. వృద్ధాప్యంలో ఉన్న తాను నివాస స్థలం, బంగారం, నగదును తన ఏకై క కుమారుడు రామాంజనేయులుకు అప్పగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి సమయాల్లో వచ్చి తనను చంపేందుకు ప్రయ త్నిస్తున్నాడని తెలిపాడు.రక్షణ కల్పించడంతో పాటు జీవనం వారి నుంచి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఉద్యోగం పేరుతో టోకరా
జీఎస్‌టీ ఆఫీసులో ఉద్యోగం పేరుతో మహిళా తన వద్ద రూ.6.50లక్షలు తీసుకుని మోసం చేసినట్టు రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన బందనాథం ఆశోక్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. నరసరావుపేటలో నివసిస్తూ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న తనకు పెట్లూరివారిపాలెంకు చెందిన మొద్దుమాల నిర్మల పరిచయమైనట్టు తెలిపాడు. జీఎస్‌టీ ఆఫీసులో ఉద్యోగం ఉందని ఇందుకు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్టు వివరించాడు. తాను అంత ఇవ్వలేనని చెప్పగా రూ.6.5లక్షలకు అంగీకరించినట్టు తెలిపాడు. నగదును అప్పుగా తీసుకుని మూడు సంవత్సరాల క్రితం ఆమెకి ఇచ్చామని, ఇప్పటి వరకు ఉద్యోగం కల్పించలేదని ఫిర్యాదులో తెలిపాడు. దీనిపై నిర్మలను ప్రశ్నించడంతో ఎస్‌సి, ఎస్‌టి కేసు పెడతానని బెదిరించినట్టు తెలిపాడు. మోసానికి పాల్పడిన నిర్మలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
ఫైనాన్స్ సంస్ధ వేదింపుల నుంచి
రక్షణ కల్పించండి...
లోన్ చెల్లిస్తానని చెబుతున్నా తమ బంధువులకు ఫోన్‌లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఫైనాన్స్ సంస్థ నుంచి రక్షణ కల్పించాలని పిడుగురాళ్లకు చెందిన గద్దల కుమార్ జిల్లా ఎస్పీని కోరాడు. హెచ్‌డీబి ఫైనాన్స్ సంస్థి నుంచి రూ.90వేలు రుణంగా తీసుకోగా ప్రతి నెల రూ.5300 చొప్పున 18 నెలలు చెల్లించినట్టు తెలిపాడు. మరో ఐదు నెలల ఈఎంఐ పెండింగ్‌లో ఉందని దీనిని చెల్లిస్తానని సంస్థి సిబ్బందికి తెలియజేసినా ఫోన్‌లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని వివరించాడు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
ఫిర్యాదులు స్వీకరించిన
జిల్లా ఎస్పీ కృష్ణారావు


