ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా షేక్ షాహిద్ బాషా(చిలకలూరిపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం (ఏపీఎమ్‌ఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రధానకార్యదర్శిగా పి.వీరబ్రహ్మం(నాదెండ్ల), ట్రెజరర్‌గా పి సత్యనారాయణరాజు(పాకాలపాడు), గౌరవఅధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా కె.జగన్నాధరావు (ముప్పాళ్ళ), జూపల్లి.గంగాధర్‌బాబు (మాచర్ల), ఎల్.రామాంజిరెడ్డి (వినుకొండ), ఏ.భాగేశ్వరిదేవి (మాదల), ఏం ఫణికుమార్ (నరసరావుపేట), కార్యదర్శులుగా ఈ పున్నమ్మ (అచ్చంపేట), జాన్‌కెనడి (మాచర్ల), కె.శ్రీనివాసరావు(చిలకలూరిపేట), ఎస్.ఆదినారాయణ(యడ్లపాడు), ఎం.శ్రీనివాసరెడ్డి(రొంపిచర్ల), సిహెచ్.నాగేశ్వరరావు(వినుకొండ), ఏ.వెంకటశ్రీవత్స (కారంపూడి), జెవికె ప్రసాద్(రెంటచింతల), కె.శివనాయక్ (ఈపూరు), పి రఘునాథబాబు (శావల్యపురం), బి.శివకోటేశ్వరరావు(దుర్గి), జి ప్రతాప్ (బొల్లాపల్లి), కె.రాంబాబు (క్రోసూరు)లు ఎన్నికయ్యారు. జిల్లా అడ్వైజరీ కమిటీ బాధ్యులుగా కె.వి.రమణ (పెదమక్కెన), ఏ శ్రీనివాసరెడ్డి (వెన్నాదేవి), పీవీ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), బట్టు ఉదయ్‌భాస్కర్ (నరసరావుపేట), పీ.విజయ్‌కుమారి (దుర్గి), పి అంజనీకుమారి(నకరికల్లు), కె.వేణుగోపాలరావు(ముప్పాళ్ళ), ఎమ్.నరేంద్రకుమార్ (సత్తెనపల్లి) లు ఎన్నికయ్యారు.


