రొంపిచర్ల: స్థానిక చపా రపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని శుక్రవారం స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూ డు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం స్థానికులు చూశారు. విగ్రహం ముఖ భాగం కనిపించకుండా ఉండటంతో స్థానికులు తొలుత దానిని రాయిగా భావించారు. శుక్రవారం గ్రామస్తులు కొందరు రాయిని దొర్లించగా విగ్రహం కనిపించింది. విగ్రహం ముక్కు, ఛాతీ, మొఖం, గధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జేసీబీ బక్కెట్‌లో విగ్రహాన్ని ఉంచి ఇక్కడకు తీసుకొచ్చి పడవేసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే విగ్రహం ధ్వంసం అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఆ విగ్రహాన్ని గుడిలోకి చేర్చి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
48 మందిపై హత్యాయత్నం కేసు
నాదెండ్ల: గణపవరం కొత్త మసీదు బజారులో మంగళవారం రాత్రి పాతకక్షల నేపథ్యంలో ఇరు ముస్లిం వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో 48 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఘర్షణలో షేక్ ఖాశింబీకి తీవ్రగాయాలై గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో పది మందికి గాయాలయ్యాయి. షేక్ ఖాశింపీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18 మందిపై, అంబటి శివ ఫిర్యాదు మేరకు 30 మందిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రెండు వర్గాలకు చెందిన 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ, ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు నిందితులను స్టేషన్‌కు తరలించారు. శనివారం కోర్టుకు హాజరుపరచనున్నారు.


