బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్‌ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం తరలించారు.
సీ్త్రనిధి ఏజీఎం నరసింహారావు
నాదెండ్ల: డ్వాక్రా సంఘాల్లోని మొండి బకాయిలను వెంటనే రికవరీ చేయాలని సీ్త్రనిధి ఏజీఎం నరసింహారావు చెప్పారు. నాదెండ్ల రెండో సచివాలయంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం సీసీలు, యానిమేటర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బ్యాంకు లింకేజీ బీపీఎం శ్రీనివాసరావు, డీపీఎం మల్లేశ్వరి, లీగల్ కోఆర్డినేటర్ సైదావలి హాజరయ్యారు. మండల పరిధిలో 1533 డ్వాక్రా సంఘాలున్నాయని, ఈ ఏడాది రూ.8 కోట్ల మేర రుణాల మంజూరు లక్ష్యంకాగా, ఇప్పటి వరకు రూ.6.5 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 48 గ్రూపుల్లో రూ.38 లక్షలకు పైగా మొండిబకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా రికవరీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రమేష్, సీసీలు పద్మ, హేమలత, సుధ పాల్గొన్నారు.


