బైక్‌ రైడర్ల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ రైడర్ల హల్‌చల్‌

Mar 24 2026 8:00 AM | Updated on Mar 24 2026 8:00 AM

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026 బైక్‌ రైడర్ల హల్‌చల్‌ నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం

న్యూస్‌రీల్‌

అర్ధరాత్రి మెయిన్‌రోడ్డులో బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు బైక్‌ స్టంట్‌లతో వాహనదారుల భయాందళనలు

ఇప్పటి వరకు పెద్ద పట్టణాలకే పరిమితమైన బైక్‌ స్టంట్స్‌ ట్రెండ్‌ చిన్న పట్టణాలకు విస్తరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఇటువంటి వీడియోలు వైరల్‌ కావడంతో యువత వీటిని అనుసరిస్తుంది. వినోదం కోసం చేస్తున్నట్టు కనిపించినా ప్రాణాంతక ప్రమాదాలకు ఇవి కారణాలవుతున్నాయి.

నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాలలో గత కొంతకాలంగా యువకులు ఇటువంటి బైక్‌ స్టంట్స్‌ ఫాలో అవుతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో రద్దీలేని రోడ్డులో బైక్‌స్టంట్స్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు

ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ యువకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఎన్‌ఆర్‌టీ వీలర్‌ పేరుతో ఇన్‌స్టాలో గ్రూప్‌ ఏర్పాటుచేసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఈ పేజీలో నరసరావుపేట పట్టణంలో అర్ధరాత్రి చేసిన స్టంట్‌లతో పాటు చిలకలూరిపేట బైపాస్‌లో చేసిన వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.

పట్టించుకోని పోలీసులు

పట్టణ శివారు ప్రాంతాలే అడ్డగా బైక్‌ రైడర్స్‌ స్టంట్‌లతో హాల్‌చల్‌ చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఇప్పటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

నరసరావుపేటలో యువకుల బైక్‌ స్టంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు పోలీసులు దానిపై దృష్టి పెట్టారు. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచే నడుస్తున్నట్టు తెలుస్తుంది. యువకులు గుంపులుగా చేరి రాత్రి సమయంలో స్టంట్‌లు చేస్తున్నా పెట్రోలింగ్‌ సిబ్బంది దృష్టి పెట్టకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రధాన రోడ్ల మీదే స్టంట్స్‌

నరసరావుపేట పట్టణంలోని ప్రధాన రోడ్లు మీదనే యువకులు బైక్‌ స్టంట్స్‌లకు పాల్పడుతున్నారు. ఎస్‌ఆర్‌కేటీ కాలనీని అడ్డగా చేసుకుని స్టంట్స్‌ వ్యవహారం నడిపిస్తున్నారు. ఎస్‌ఆర్‌కేటీ కాలనీ నుంచి చిలకలూరిపేట ప్లైఓవర్‌ వరకు కిలోమీటరు పైగా రోడ్డు అర్ధరాత్రి సమయాల్లో ట్రాఫిక్‌ తక్కువగా ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న యువకులు బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. దీంతో పాటు రేసింగ్‌లు, హైస్పీడ్‌ స్టంట్‌లతో రెచ్చిపోతున్నారు.

రావిపాడు రోడ్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ రోడ్డులో రాత్రి 9 గంటల తరువాత బైక్‌ రైడర్స్‌ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మితిమీరిన వేగంతో బైక్‌లను నడుపుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

పల్నాడు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
నరసరావుపేటలో

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,800, గరిష్ట ధర రూ.9,400, మోడల్‌ ధర రూ.8,500 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 535.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 27,276 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.

సత్తెనపల్లి: వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దశల వారీ పోరాటం తప్పదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బందగీ సాహెబ్‌ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌ ఆర్డీవో కె.శ్రీరాములును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బందగీసాహెబ్‌ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేలు, జీతాలు అమలు చేయాలన్నారు. వీఆర్వో, రికార్డ్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మన్‌ పోస్టులను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలన్నారు. నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలన్నారు. వీఆర్‌ఏలకు అక్రమ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. ఈ నెల 26న జరగనున్న రిలే నిరాహార దీక్షకు జిల్లాలో ఉన్న అన్ని మండలాల వీఆర్‌ఏలు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అన్ని మండలాల నాయకులు మీ మండలంలో ఉన్న వీఆర్‌ఏల అందరూ తప్పనిసరిగా పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. ప్రమోషన్‌, నామిని వీఆర్‌ఏలు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నాలన్నారు. ఆర్డీవో శ్రీరాములు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, మండల ప్రధాన కార్యదర్శి మునాఫ్‌, ఉన్నారు.

సత్తెనపల్లి ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీరాములకు వినతి పత్రం అందిస్తున్న బందగీసాహెబ్‌, నాయకులు

7

నరసరావుపేట రూరల్‌: ౖబెక్‌లపై ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ రైడర్స్‌ నరసరావుపేట పట్టణంలో హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రధాన రోడ్లులో అర్ధరాత్రి యువకుల చేస్తున్న విన్యాసాలతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. బైక్‌ స్టంట్స్‌ను యువత సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అవి వైరల్‌ మారాయి. దీంతో పోలీసులు చర్యలు ప్రారంబించారు. బైక్‌ స్టంట్స్‌లో పాల్గొన్న యువతను గుర్తించే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement