గ్యాస్‌ కోసం రోడ్డెక్కిన వినియోగదారులు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కోసం రోడ్డెక్కిన వినియోగదారులు

Mar 24 2026 8:00 AM | Updated on Mar 24 2026 8:00 AM

నకరికల్లు: గ్యాస్‌ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఖాళీ సిలిండర్‌లతో స్థానిక అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్‌ సిలిండర్‌లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన స్థానిక రాష్ట్ర రహదారిపై వైజంక్షన్‌ వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఇండేన్‌ గ్యాస్‌ ఏజన్సీలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. కాగా గత వారంరోజులుగా గ్యాస్‌ బుకింగ్‌ చేసినవారికి ఓటీపీ రావడం లేదు. అలాగే సిలిండర్‌ల పంపిణీ జరగడం లేదు. దీంతో సమీప గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్‌లతో వినియోగదారులు స్థానిక గోడౌన్‌ వద్దకు చేరుకున్నారు. నోస్టాక్‌ బోర్డు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ సమస్యను పరిష్కరించాలని, గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీ ప్రారంభించాలని స్థానిక రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కె.సతీష్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్య కాబట్టి త్వరలో పరిష్కారమవుతుందని సర్దిచెప్పారు. ఆందోళన చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని హితవు పలికారు. దీంతో శాంతించిన వినియోగదారులు ఆందోళన విరమించారు.

ఖాళీ సిలిండర్‌లతో అద్దంకి–

నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నిరనస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement