మెగా..పెద్ద దగా | - | Sakshi
Sakshi News home page

మెగా..పెద్ద దగా

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

మెగా.

మెగా..పెద్ద దగా

నేడు మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ 3.0 మీటింగ్‌ చంద్రబాబు ప్రభుత్వం మరో ప్రహసనం

సమస్యల పరిష్కారానికి చర్యలు శూన్యం తాగునీటి కోసం విద్యార్థుల అవస్థలు

మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో బాలికల కష్టాలు ఇవేమీ పట్టని ప్రభుత్వం

ఈ చినిగిన బ్యాగ్‌ చూడండి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్‌ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని హ్యాండిల్స్‌ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్‌ చేసి ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చెప్పుకొచ్చారు. దానికి భిన్నంగా బ్యాగ్‌లు నాసి రకంగా ఉన్నాయి. కొద్ది రోజులకే చినిగిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆంక్షలు లేవు. నిబంధనలు ఉండవు. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల ఆదాయం, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం, భూములు, కార్లు, చిరుద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, తదితర వారికి తల్లికి వందనం లేదని తేల్చి చెప్పేశారు.

సత్తెనపల్లి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితులు తెలుసుకునేందుకు పై ఉదాహరణలు చాలు. చంద్రబాబు ప్రభుత్వం అటు పాఠశాలలు, ఇటు విద్యార్థులను మోసం చేసింది. ఇప్పుడు గొప్పల కోసం మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ 3.0 మీటింగ్‌ అంటూ హడావుడి చేస్తోంది. దీనికే సమయం అంతా కేటాయించడంతో 10 రోజులుగా పాఠాలు చెప్పేవారు కరువై మెగా కాస్త దగాగా మారిందని పలువురు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారలేదు. ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులతో పోటీపడేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ పనులను పక్కనపెట్టి ప్రచార ఆర్భాటానికి తెర తీయడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. డిసెంబర్‌ నెల ప్రారంభమైనప్పటికీ సిలబస్‌ పూర్తి కాలేదు. 100 రోజులుగా మెగా పీటీఎం 3.0 పనులే సరిపోయాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

పరిష్కారం కాని సమస్యలు...

● పాఠశాలల్లో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● మరుగుదొడ్లు సమస్య పలు పాఠశాలలను వేధిస్తోంది. ఉన్న మరుగుదొడ్లు సరిపోక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.

● ముఖ్యంగా వర్షాలకు నీరు నిలిచి పాఠశాలలోకి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి 31వ వార్డులో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మోంథా తుఫాన్‌కు వర్షం నీరు నిలిచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు.

● పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్‌లు పనిచేయక తాగునీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్‌లు ఉన్నా ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారాయి.

● పాఠశాలల్లో అనేక రకాల సమస్యలు ఉన్నా, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు.

పాఠశాలల రూపురేఖలు మార్చిన వైఎస్‌ జగన్‌

నాడు–నేడు కింద గత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చింది. ఈ ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదు. పాలకుల నిర్లక్ష్యంతో నాడు–నేడు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లా పరిధిలో రూ. 165 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. నాడు–నేడు మొదటి దశలో 746 పాఠశాలల్లో పనులు చేపట్టాల్సి ఉంది. 88 పాఠశాలలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. రెండో దశలో 629 పాఠశాలలకు గాను కేవలం 33 పాఠశాలల్లోనే పనులు పూర్తి చేశారు. 233 పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభించని దుస్థితి.

మెగా..పెద్ద దగా 1
1/2

మెగా..పెద్ద దగా

మెగా..పెద్ద దగా 2
2/2

మెగా..పెద్ద దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement