పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Dec 4 2025 7:32 AM | Updated on Dec 4 2025 7:32 AM

పల్నా

పల్నాడు

గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 చైర్‌పర్సన్‌ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి

న్యూస్‌రీల్‌

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఎమ్మెల్యే జూలకంటి వైఖరిపై ధ్వజం

గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
చైర్‌పర్సన్‌ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 579.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,445 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

దాచేపల్లి: కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ విషయాన్ని పల్నాడులోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరిని అడిగినా చెబుతారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. కాసు కుటుంబ చరిత్ర తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కాసు కుటుంబంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. కాసు కుటుంబ చరిత్ర, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి పలు దిన పత్రికలలో రాసిన కథనాలను ఆయన చదివి వినిపించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగేటప్పుడు తాను, ఎమ్మెల్యే కూడా పుట్టి ఉండమని చెప్పారు. పుస్తకాలు, వ్యాసాలు చదివితే చరిత్ర తెలుస్తుందన్నారు. రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి అని, జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయ్యేందుకు భగీరథ ప్రయత్నం చేశారని తెలిపారు. సీఎంగా ఉండగానే సాగర్‌ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించారని గుర్తుచేశారు. ఆ రోజుల్లోనే రూ.10 కోట్ల హడ్కో రుణాలు ఎల్‌ఐసీ ద్వారా పొంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీనవర్గాల వారికి ఇళ్లు కట్టించిన ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని వివరించారు. 1970లో 70 బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాసు బ్రహ్మానందరెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఎవరో రాసిచ్చింది చదివితే అది చరిత్ర కాదన్నారు. వరికపూడిసెల ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అన్ని రకాల అనుమతులు తమ ప్రభుత్వంలో తెచ్చి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని గుర్తుచేశారు. గతంలో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పదవిలో ఉన్నా ఎందుకు అనుమతులు తీసుకురాలేదని ప్రశ్నించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: జెడ్పీ చైర్‌పర్సన్‌, టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుతో జెడ్పీటీసీలు ఏళ్ల తరబడి పనులు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి జెడ్పీతోపాటు కేంద్ర నిధుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్‌, జనరల్‌ బాడీ సమావేశాలకు హాజరై అజెండాల ఆమోదానికి పరిమితమవుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధ్యాన్యత ఇస్తూ చైర్‌పర్సన్‌ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. గతంలో సర్వసభ్య సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన జెడ్పీటీసీలు గత నెల 26న ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. కీలకమైన ప్రణాళిక, ఆర్థిక అంశాలతో కూడిన సమావేశాల అజెండాలను తిరస్కరించడం ద్వారా జెడ్పీలో ఏకపక్ష వైఖరిపై యుద్ధం ప్రకటించారు.

ప్రచ్ఛన్న యుద్ధం

జెడ్పీలో చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాకు, వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీగా గెలిచాక చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిష్టించి, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన హెనీ క్రిస్టినా వైఖరితో జెడ్పీటీసీలు తీవ్రంగా విభేదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ మండలాల్లో పనులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును సహించలేక పోరుకు సిద్ధమయ్యారు.

ఎవరితోనూ పనిలేకుండానే...

జెడ్పీ వార్షిక బడ్జెట్‌లో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు 2025–26 బడ్జెట్‌లోనే కేటాయింపులు పూర్తయ్యాయి. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సైతం పనులు కేటాయించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సులు పంపడం, వాటిని చైర్‌పర్సన్‌ వెంటనే ఆమోదించేయడం పరిపాటిగా మారింది. జెడ్పీటీసీలతో చర్చించకుండా నేరుగా స్టాండింగ్‌ కమిటీ, అక్కడి నుంచి జనరల్‌ బాడీ సమావేశాల అజెండాల్లో పొందుపర్చి ఆమోదింపచేసుకుంటున్నారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై సభ్యులతో చర్చించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి భిన్నంగా కోరం అయిందా, లేదా అని చూసి ఆమోదించేస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో..

జెడ్పీటీసీలకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో చైర్‌పర్సన్‌ పెద్ద సంఖ్యలో కేటాయింపులు జరిపేశారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... వేమూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో రూ.29.30 లక్షలు, నరసరావుపేట ఎమ్మెల్యే సిఫార్సులతో రూ.20 లక్షలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రతిపాదనలతో రూ.30 లక్షలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాదనలతో అత్యధికంగా రూ.కోటి పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల మేరకు ముందస్తు అనుమతులతో పనులు కేటాయించడంతో భగ్గుమన్న జెడ్పీటీసీలు వాటిని అడ్డుకున్నారు.

7

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం కావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది.

ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జెడ్పీని

వాడుకుంటున్న పాలకుల తీరుతో

జిల్లా ప్రజా పరిషత్‌ పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి.

పల్నాడు1
1/8

పల్నాడు

పల్నాడు2
2/8

పల్నాడు

పల్నాడు3
3/8

పల్నాడు

పల్నాడు4
4/8

పల్నాడు

పల్నాడు5
5/8

పల్నాడు

పల్నాడు6
6/8

పల్నాడు

పల్నాడు7
7/8

పల్నాడు

పల్నాడు8
8/8

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement