వందేమాతరం గీతానికి ప్రత్యేక స్థానం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశభక్తి తోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గీతం స్ఫూర్తిగా నిలిచిందని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా పేర్కొన్నారు. వందేమాతర గీతాలాపనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో గీత రచయిత బంకించంద్ర చటర్జీ, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయులను బానిసలుగా మార్చి అధికారం చెలాయిస్తున్న బ్రిటీషువారికి వందేమాతర గీతంతో దీటైన విధంగా సమాధానం చెప్పారని అన్నారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ జాతిని ఏకతాటిపైకి తెచ్చి ప్రజల్లో దేశభక్తిభావాన్ని పెంపొందించడంలో వందేమాతరగీతం కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో ఏవో రత్నబాబు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఉద్యోగులు పాల్గొన్నారు.


