శివ.. శివా..!
న్యూస్‌రీల్
భక్తుల విశ్వాసం మాటున దోపిడీ నరసరావుపేట కేంద్రంగా రూ.కోట్లలో అక్రమ వ్యాపారం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని అధికార యంత్రాంగం
అధికారులపై విమర్శలు..
జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు
పల్నాడు
శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025
పవిత్ర దీపారాధన నూనెలో కల్తీ కలకలం రేపుతోంది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయటంతోపాటు అక్రమార్కులు వ్యాపారం మాటున దోపిడీకి తెగబడుతున్నారు. పూజ నూనెల పేరుతో నాసిరకం రసాయనాలు డబ్బాల్లో నింపి విక్రయిస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న నూనెల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పూజల్లో వినియోగించాల్సిన సంప్రదాయ నూనెలను కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని వ్యాపారులు ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.
నాదెండ్ల: గణపవరం శివనాగేంద్రస్వామి పుట్ట వద్ద ఉన్న కనకదుర్గమ్మ వారి గ్రామోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కల్తీలకు కేంద్ర బిందువుగా మారింది. ఔషధాలు, పప్పులు, వంట నూనెలతో పాటు దీపారాధన నూనెను పెద్ద ఎత్తున కల్తీ చేసి ఇతర జిల్లాలకు ఎగుమతి చేయడంలో ఇక్కడ సిద్ధహస్తులున్నారు. పూజ నూనెలకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. కుటీర పరిశ్రమలు మాదిరి ఇక్కడ సుమారు 40 వరకు యూనిట్లున్నాయి. జీఎస్టీ, వ్యాపార అనుమతి లేకుండా నాన్ ఎడిబుల్ ఆయిల్ పేరుతో దీపారాధన నూనెగా ప్యాకింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్, పామాయిల్, ఆముదం, వేప, కొబ్బరి నూనెలను వేరువేరుగా కల్తీ చేసి ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. కాకినాడ, కృష్ణపట్నం, చైన్నె ఓడరేవుల నుంచి కూడా ఇక్కడికి నేరుగా నిల్వలు తెప్పించి పుట్టగొడుగుల్లా యూనిట్లను నెలకొల్పారు. అగ్నిప్రమాద నివారణకు జాగ్రత్తలు, కార్మికులకు భద్రత, శుభ్రత ప్రమాణాలు గాలికొదిలేశారు.
కల్తీ నూనెలతో టోకరా..
ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో పూజ నూనెను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో మిల్లుల నుంచి తక్కువ గ్రేడులోని నాసిరకం వేరుశెనగ నూనెను కిలో రూ.110 వంతున కొనుగోలు చేస్తున్నారు. మోటారు వాహనాల ఇంజిన్లలోని మడ్డి ఇంధనం శుద్ధి చేసిన ఆయిల్‌కు రంగులు కలుపుతున్నారు. లీటరు, అరలీటరు, 250 మి.లీ., 100 మి.లీ. డబ్బాలుగా విభజిస్తున్నారు. గరిష్ఠంగా మార్కెట్లో లీటరు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు తీసిపోని విధంగా లేబుల్స్ వేస్తున్నారు. దానిపై నాన్ ఎడిబుల్ రైస్ బ్రాన్ (ఆర్‌బీ) ఆయిల్‌గా ముద్రిస్తున్నారు. దీంతో నమూనాలు తీసి పరీక్షించాలన్న ఆలోచన లేకుండా అధికారులను మభ్యపెడుతున్నారు. నువ్వుల నూనెగా భక్తులను భ్రమలో ముంచుతున్నారు. కల్తీ నూనె దీపం నుంచి వెలువడే పొగ వాసన పీల్చితే అనారోగ్యంతోపాటు ప్రమాదకర మైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు ఓ వైపు హెచ్చరిస్తున్నారు.
ఏటా రూ.కోట్లలో వ్యాపారం
ప్రతి ఏటా నరసరావుపేట కేంద్రంగా రూ.400 కోట్లకుపైగానే వంట నూనెల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దీపారాధన నూనెను లెక్క చూపడం లేదు. అనుమతులు తీసుకోకుండా అందులోనే ప్యాకింగ్ చేస్తున్నారు. బిల్లులు, లెక్కా పత్రం లేకుండా వంట నూనె చాటున పూజ నూనెను విక్రయిస్తున్నారు. ఇలా ఎక్కువ మొత్తం జీరో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ భక్తి ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఓ ఆయిల్ మిల్లులో తనిఖీ చేస్తున్న జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ (ఫైల్)
కల్తీ నూనెల నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కల్తీ నూనెల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నరసరావుపేట: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్థానిక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన సోదాలు గురువారం కూడా కొనసాగాయి. దీంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇతర లావాదేవీలు జరగలేదు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మీడియాతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మాట్లాడుతూ తాము ఉదయం నుంచి నిర్వహించిన సోదాల్లో అన్ అకౌంటెడ్ సొమ్ము రూ.35 వేలు గుర్తించామన్నారు. కార్యాలయంలో దస్త్రాల పరిశీలన పూర్తికాలేదని, మరుసటిరోజు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా అధికారులు దస్త్రాలను పరిశీలన కొనసాగించారు. నెల రోజులుగా చేసిన రిజిస్ట్రేషన్ల వివరాన్నింటినీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఎవరూ కార్యాలయంలోకి వెళ్లేందుకు సాహసించలేదు. ఒకరిద్దరు మినహా మిగతా డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను మూసేసి తాళాలు వేశారు. ఏం జరుగుతుందోనని కార్యాలయ పరిసరాల్లో వారందరూ తచ్చాడారు. అధికారుల నుంచి అధికారికంగా సమాచారం ఏమీ లేదు.
శివ.. శివా..!
శివ.. శివా..!
శివ.. శివా..!
శివ.. శివా..!
శివ.. శివా..!


