బెల్టు షాపుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బెల్టు షాపుల నిర్మూలనకు ఎకై ్సజ్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో పల్నాడు, గుంటూరు జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జిల్లాలో బెల్టు షాపుల నిర్మూలన ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.. బార్ అండ్ రెస్టారెంట్స్‌లో నిబంధనల మేరకు విక్రయాలు జరిగేలా చూడాలని తెలిపారు. కేసులు పెండింగ్‌లో ఉంటే సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం సీసాలను స్కానింగ్ చేసి మాత్రమే విక్రయించేలా అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఎం.రవికుమార్‌రెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాల ఎకై ్సజ్ అధికారులు వి.అరుణకుమారి, కె.మణికంఠ, ఏఈఎస్‌లు మారయ్యబాబు, రవీంద్ర, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


