హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

Nov 7 2025 7:25 AM | Updated on Nov 7 2025 7:25 AM

హైటెక

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు గూడ్స్‌ రైలు ఢీకొని యువకుడిమృతి

ఆన్‌లైన్లో బుకింగులు ఇంట్లో వ్యవహారాలు

యడ్లపాడు: ఆన్‌లైన్‌ వ్యభిచార దందా చేస్తున్న వారి గుట్టు పోలీసులు రట్టు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న యువతుల ఆసరాలను అవకాశంగా తీసుకుని వారిని వ్యభిచార ఊబిలోకి దింపుతున్న నిర్వాహకురాలిపై నిఘా నిర్వహించారు. కొద్దికాలంగా రహస్యంగా వ్యభిచారం నిర్వహించే గృహంపై మెరుపుదాడి చేసి ఇద్దరు విటులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకుని ఓ బాధితురాలిని కాపాడారు. రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణతో కలిసి చిలకలూరిపేట రూరల్‌సీఐ బి.సుబ్బానాయుడు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతకాలం కిందట భర్తతో విడిపోయి విడిగా ఉంటోంది. అయితే ఆమె వ్యభిచార నిర్వహణను ఉపాధి మార్గంగా ఎంచుకుంది. యడ్లపాడు గ్రామంలోని 16వ జాతీయ రహదారి పక్కన పిల్లికొండ సమీపంలో నివాస వాసాలు పెద్దగా లేని ఓ ఇంటిని ఏర్పాటు చేసుకుంది. కొంతకాలంగా యువతుల ఫోటోలు పోస్ట్‌ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తోంది. విటులను ఫోన్‌ ద్వారా సంప్రదించడం, యువతుల ఫోటోలను వారికి వాట్సప్‌ ద్వారా పంపించడం.. నచ్చితే వెంటనే యూపీఐ ద్వారా నగదు పొందడం వంటి అన్ని కార్యాకలాపాలు హైటెక్‌ తరహాలో నిర్వహిస్తోంది. ఈ వ్యభిచార వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో గురువారం యడ్లపాడులోని వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని ఓ బాధితురాలిని కాపాడారు. వారి నుంచి నిర్వాహకురాలి వివరాలు తెలుసుకుని చిలకలూరిపేట మండలం పసుమర్రులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్‌ స్వాధీనం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కేసు నమోదు చేశారు.

బాపట్ల టౌన్‌: బాపట్ల రైల్వే స్టేషన్‌లో గురువారం గూడ్స్‌ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం... చీరాల పట్టణం విఠల్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మారుగడ సురేష్‌ బాబు (20) ప్రతిరోజు రైలులో వచ్చి బాపట్ల, కర్లపాలెం ప్రాంతాల్లో పనులు చేసుకొని తిరిగి వెళ్తుంటాడు. ఈ క్రమంలో గురువారం బాపట్లలో రైలు దిగి ఉప్పరపాలెం గేటు సమీపంలో ట్రాక్‌ దాటుతుండగా అదే సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్‌ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటూ గేటు దాటుతుండగా ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు 
1
1/2

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు 
2
2/2

హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement