వివిధ ఆకృతుల్లో దీపాల ఏర్పాటు
యడ్లపాడు: మండలంలోని పలు ఆలయాల్లో కార్తిక పౌర్ణమి కాంతులు వెదజల్లాయి. బుధవారం రాత్రి ఆలయాల్లో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. లింగారావుపాలెం శివాలయం, సొలస గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయం, జాలాదిలోని హరిహర దత్త క్షేత్రం, బోయపాలెంలోని హరిహరక్షేత్రంలో కార్తికపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా దీపాలను స్వస్తిక్, ఓంకారం, శివలింగం, శంఖు చక్రాలు, వెంకన్న నామాలు వంటి రకరకాలుగా గుడి ప్రాంగణంతో పాటు ప్రహరీలపై, ద్వారాలపై ఉంచి ఆలయమంతా తేజోమయం చేశారు. ఈ సందర్భంగా ఆలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేశారు.
వివిధ ఆకృతుల్లో దీపాల ఏర్పాటు


