అనుకుంటున్నారా?! | - | Sakshi
Sakshi News home page

అనుకుంటున్నారా?!

Nov 7 2025 6:55 AM | Updated on Nov 7 2025 6:55 AM

అనుకుంటున్నారా?!

అనుకుంటున్నారా?!

అనుకుంటున్నారా?! మామూళ్ల వసూళ్లలో తేడాలపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య యుద్ధం ● ఇంకా ఐపీఎస్‌ అని భావిస్తున్నారేమో!! ● ఎవరి పరిధిలో వాళ్లుంటే మంచిది ● మీరెవరికీ ఏ అమౌంట్‌ ఇవ్వనక్కర్లేదు ● ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ● పై వాళ్లతో మేం మాట్లాడుకుంటాం ● రచ్చకెక్కిన ప్రజాప్రతినిధుల విభేదాలు

చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాయాలపాలవుతున్నారు. కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటోంది. కనీస ప్రమాణాలు పాటించడం లేదు. క్షుణ్నంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోండి.

బాపట్ల, చీరాల తీర ప్రాంతాలలో రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు సముద్రంలోకి కాలుష్య కారకాలు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నాయి. మత్స్యసంపదపై తీవ్ర ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. చేపలు లభించక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లను పరిశీలించండి.

చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు అధికమయ్యాయి. ఇష్టానుసారం ఇసుక తోడేస్తున్నందున భూగర్భజలాలు అడుగంటుతూ మంచినీటికి సమస్యగా ఉంది. రోడ్లు పాడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను పరిష్కరించండి.

ఆయన ఎస్పీ..
మేం సీఐలం..

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వాస్తవంగా ప్రజాసమస్యల పరిష్కారానికి పై ప్రయత్నాలు జరుగుతుంటే సంబంధితులను తప్పనిసరిగా అభినందించాల్సిందే. ఫిర్యాదులు చేస్తున్న వారికి సహకరించాల్సిందే. మద్దతు కూడా ఇవ్వాల్సిందే. కానీ బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భిన్నమైన విమర్శలు అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచే వినిపిస్తున్నాయి. మామూళ్లు రాబట్టుకోవడానికి వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే ఫిర్యాదుల పరంపర అని కూటమి పార్టీల నేతల నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ

కూటమి సర్కారులో ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ఆయా ప్రాంతాల్లోని ఇసుక, మట్టి, గ్రావెల్‌, గ్రానైట్‌ తదితర సహజ వనరులను ఉమ్మడిగా యథేచ్ఛగా దోపిడీ చేసేస్తున్నారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నెలవారీ మామూళ్లకు తెగబడుతున్నారు. చీమకుర్తి, బల్లికువర గ్రానైట్‌ పరిశ్రమపై గద్దల్లా వాలిపోయి ఒత్తిళ్లు పెంచేస్తున్నారు. ఈ పరిశ్రమ నుంచి రాజకీయ పలుకుబడి కలిగిన, స్థితిమంతులు కూడా ఉన్నందున అన్ని సందర్భాలలో ఆయా ప్రజా ప్రతినిధుల ఆటలు సాగడం లేదు.

ఫిర్యాదుల పరంపర...

‘మేమూ ఎన్నికల్లో పోటీ చేశాం. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఇతరులకు ఇస్తున్నట్లు మాకూ నెలవారీగా మామూళ్లు పంపండి’ అని ఓ ప్రజాప్రతినిధి గ్రానైట్‌ పరిశ్రమ పెద్దలకు పలుసార్లు గుర్తుచేసినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని సమాచారం. క్రమశిక్షణ కలిగిన శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆ ప్రజాప్రతినిధికి ఆగ్రహం కలిగింది. తన మాట చెల్లుబాటు కానందుకు, ఆశిస్తున్న స్థాయిలో రాబట్టుకునేందుకు గ్రానైట్‌ పరిశ్రమపై పట్టు పెంచుకునేందుకుగాను ఢిల్లీ, హైదరాబాద్‌, అమరావతిల్లోని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ తక్షణం క్వారీలలో తనిఖీలు నిర్వహించాలనే ఒత్తిళ్లు కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 30న చీమకుర్తిలో మైన్స్‌ సేఫ్టీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ సారథ్యంలో డిప్యూటీ డైరెక్టర్‌ జ్ఞానేశ్వర్‌ తదితర అధికారుల బందం పర్యటించింది. ప్రజాప్రతినిధుల నుంచి తమకు ఫిర్యాదులు అందకుండా తగువిధంగా నడుచుకోవాలని పరిశ్రమ యజమానులకు పరోక్షంగా వారు హితవు పలికినట్లు తెలిసింది.

ఎందరి డిమాండ్లను నెరవేర్చాలి...

‘అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు, వివిధ రకాల మామూళ్లు, ప్రజాప్రతినిధుల తీరు వలన పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. అమరావతిలోని పెద్దలకు మీ లాంటి వారి ద్వారా పెద్ద మొత్తాల్లో ముట్టజెప్పాల్సి వస్తోంది. మా సమస్యలు మీకూ తెలుసు. అలాంటప్పుడు ఫిర్యాదులు చేసి తనిఖీలకు ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి అధికారులను పంపిస్తుంటే ఎలా?’ అని గ్రానైట్‌ పరిశ్రమ ప్రతినిధులు వాపోయినట్లు సమాచారం.

భిన్నంగా బాపట్ల...

బాపట్ల లోక్‌సభ పరిధిలో గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌లు మంత్రులు. గొట్టిపాటి స్వయంగా గ్రానైట్‌ వ్యాపారి. పరిశ్రమలోని అందరికీ ఆయన సుపరిచితులు. బాపట్ల, చీరాల ఎమ్మెల్మేలు వేగేశన నరేంద్రవర్మ, ఎం.ఎం.కొండయ్య, లోక్‌సభ ప్రజాప్రతినిఽధికి మధ్య తొలి నుంచే విభేదాలు కొనసాగుతున్నాయి. వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కా ఆనందబాబు మాజీ మంత్రి, పార్టీలో సీనియర్‌ నేత. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ సీనియర్‌ నాయకుడు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావుకు పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో ఆయన ఎవరినీ లెక్క చేయరనే గుర్తింపు ఉంది. దీంతో స్థానిక ఎంపీ ఉనికిని ప్రజాప్రతినిధులు లెక్కలోకి తీసుకోరని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వీటన్నింటి దృష్ట్యా తనదైన అనుభవంతో ఎంపీ ముందుకు వెళుతున్నా ఆయా ప్రాంతాలు, వర్గాల నుంచి ప్రాధాన్యత దక్కడం లేదంటున్నారు. ఇందుకు కారణం స్థానిక ప్రతినిధుల తీరేనని ఎంపీ వర్గీయులు అభిప్రాయపడుతుండటం రాజకీయంగా పరిశీలనాంశం. బాపట్ల లోకసభ పరిధిలోని ప్రజాప్రతినిధుల మధ్య వాటాలలో తేడాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఎవరి సంపాదన వారిదిగానే ఉంది. ఇక్కడి నేతలు కూడా ఎవరికి వారే అనే రీతిలో కొనసాగుతుంటారనేది వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement