
కృష్ణమ్మ ఉగ్రరూపం
ప్రభుత్వ భూమిపై కూటమి నేతల కన్ను
అమరావతి: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి శనివారం సుమారు ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేశారు. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుంది. ఆదివాంర సాయంత్రం ఆరు గంటలకు స్థానిక అమరేశ్వర ఘాట్‌లో సుమారు 11 అడుగుల మేర నీటిమట్టం పెరిగినట్లు సమాచారం. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిలోని అమరేశ్వర ఘాట్, ధ్యానబుధ్ద ఘాట్‌లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణానదికి అటు వైపున ఉన్న లంక గ్రామాల ప్రజలను, పశువులు, జీవాలను అవసరమైతే అమరావతి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి– విజయవాడ రోడ్డులోని పెద మద్దూరు గ్రామం వద్ద వాగు చప్టాపై సుమారు మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి 6,09,916 క్యూసెక్కులు విడుదల చేయడంతో గిరిజన తండాలైన జడపల్లి, కంచుబోడు తండాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు తండాల మధ్యలో ఉన్న కొండకోయ వాగుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తండాల ప్రజలు జల దిగ్భందంలో చిక్కుకున్నారు. తండాల నుంచి ఎవ్వరూ ప్రయాణించవద్దంటూ రెవెన్యూ, పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో కృష్ణానదీ పరివాహక గ్రామాలలో వేసిన పత్తి పంటలు నీట మునిగాయి. కృష్ణానదికి వరద పోటెత్తడంతో నిత్యం నదిపై నుంచి అవతలి ఒడ్డుకు, ఇవతలి ఒడ్డుకు తిరిగే ప్రయాణ సాధనాలు నిలచిపోయాయి. తహసీల్దార్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ నదీ తీర ప్రాంతంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని చెప్పారు. నదిలోకి ఎవ్వరూ వెళ్లకుండా 24 గంటలు కనిపెట్టుకునే విధంగా షిఫ్ట్ సిస్టంలో వీఆర్వో, వీఆర్యేలను కాపాల ఉంచామని తెలిపారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గే వరకు నదిపై పడవలు వేస్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, నదిలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు.
ఎగువ నుంచి ఆరు లక్షల
క్యూసెక్కులు విడుదల
గంటగంటకు పెరుగుతున్న వరద
అప్రమత్తమైన అధికారులు
ఘాట్‌ల వద్ద పోలీసుల భద్రత
ఆందోళనలో లంక గ్రామాల ప్రజలు
ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో 20 ఎకరాల భూమిని చదును చేసిన వైనం

కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణమ్మ ఉగ్రరూపం