
ఆదర్శంగా నిలిచిన కుటుంబం
తొలుత భర్త, నేడు భార్య నేత్రదానం కుమారుడు, కుమార్తె కూడా నేత్రదానం చేసేందుకు అంగీకారం
కారంచేడు: తాను చనిపోయిన తరువాత మరొకరికి చూపునివ్వాలని గ్రామానికి చెందిన యార్లగడ్డ బుల్లెయ్య నిర్ణయించుకున్నారు. ఆయన ఆగస్టు 29వ తేదీన మృతి చెందాడు. అప్పుడు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా ఆయన భార్య యార్లగడ్డ నాగేంద్రం (80) ఆదివారం ఉదయం మృతి చెందగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నిలిచి నేత్రాలను దానం చేయగా.. పెదకాకానిలోని శంకర నేత్రాలయం వారు ఆదివారం నేత్రాలను సేకరించారు. కాగా తమ తల్లి కోరిక ప్రకారం కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె అనంతలక్ష్మి కూడా నేత్రాలను దానం చేయడానికి అంగీకరించడం విశేషం.