
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఒకరికి తీవ్ర గాయాలు
మాచర్ల రూరల్: దుర్గి మండలంలో వేర్వేరు చోట్ల ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న ఇరువురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. దుర్గి మండలంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకొని ద్విచక్ర వాహనంపై రాయపాటి ఆనంద్ (15) తిరిగి దుర్గి వస్తుండగా ట్రాక్టర్‌ను దాటేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగం ఢీ కొనటంతో రోడ్డు పై పడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. గాయపడిన ఆనంద్‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
దుర్గి మిర్చియార్డు వద్ద..
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని దుర్గి మిర్చియార్డు వద్ద చోటుచేసుకుంది. ఆత్మకూరు గ్రామంలోని నర్సరీలో పనిచేస్తున్న కొమరగిరి ఆదినారాయణ (45) మరొక వ్యక్తి ద్విచక్ర వాహనం పై మాచర్లకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న కొమరగిరి ఆదినారాయణ తలకు తీవ్రంగా గాయమై సంఘటన స్ధలంలోనే మృతిచెందాడు. వెనుక కూర్చున్న బోసురాజు కొండకు తీవ్ర గాయాలు కాగా మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆదినారాయణ మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామానికి చెందినవాడు. ఈ మేరకు ఎస్‌ఐ సుధీర్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెట్టు కొమ్మలు నరుకుతూ
విద్యుత్ షాక్‌తో మృతి
కారెంపూడి: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కారెంపూడిలో ఆదివారం జరిగింది. ఓ ఇంట్లో చెట్టు కొమ్మలు తొలగించే కూలి పనికి వెళ్లి చెరుకూరి వెంకట కోటయ్య (33) చెట్టు కొమ్మలు తొలగిస్తున్న క్రమంలో ఒక కొమ్మ 11 కేవి విద్యుత్తు లైన్‌పై పడడంతో తీగ తెగి మీదపడి మృత్యవాత పడ్డాడు. వెంకట కోటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో ఇందిరానగర్ కాలనీలో విషాధం అలుముకుంది.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి