
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సత్తెనపల్లి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 19న చలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పేరుతో పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించేందుకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళుతుండగా సత్తెనపల్లిలో పోలీసులు అడ్డుకుని, విద్యార్థులతో వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమన్నారు. దీనిలో భాగంగా తమపై నమోదు చేసిన అక్రమ కేసులో విచారణ నిమిత్తం శనివారం సత్తెనపల్లి టౌన్ పీఎస్‌కు హాజరయ్యామన్నారు. పార్టీ గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు కళ్ళం హరికృష్ణారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నవీన్, గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సీహెచ్ వినోద్, యువజన విభాగం గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సుభాని, శశిధర్, విద్యార్థి విభాగం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పి.సందీప్, విద్యార్ధి విభాగం నాయకుడు రవీంధ్ర ఉన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య