
ఆట్యా–పాట్యా ఓవరాల్ చాంపియన్ పల్నాడు
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రఽథమ స్థానంలో నిలిచిన పల్నాడు బాలికల జట్టు
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రఽథమ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా బాలుర జట్టు
నకరికల్లు: ఆట్యా–పాట్యా రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా నిలిచాయి. నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఽఆధ్వర్యాన రెండురోజుల పాటు నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్‌షిప్–2025 పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. వర్షంలోనూ ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు సాగాయి. ఎస్‌ఐ కె.సతీష్ చేతుల మీదుగా విజేతలకు పతకాలు, మెడల్స్, సర్టిఫికెట్‌లు పంపిణీ చేశారు.
విజేతల వివరాలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 540 మంది క్రీడాకారులు తలపడ్డ ఆట్యా–పాట్యా పోటీలో పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో కర్నూలు, తృతీయస్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో నెల్లూరు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో వెస్ట్ గోదావరి, తృతీయస్థానంలో నెల్లూరు, నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా జట్లు నిలిచాయి. అసోసియేషన్, గ్రామస్తులు, క్రీడాభిమానుల సహకారంతో పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణిని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 డి.బ్రహ్మేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాలాది శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్‌లు చింతా పుల్లయ్య, నిడికొండ జానకిరామయ్య, చినబాబు, పెదబాబు, ప్రధానోపాధ్యాయులు కె.రంగాదేవి, కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆట్యా–పాట్యా ఓవరాల్ చాంపియన్ పల్నాడు