
జిల్లా జీఎస్‌టీ అధికారి జాన్ స్టీవెన్‌సన్
జీఎస్‌టీ రెండు స్లాబులతో ప్రజలకు మేలు
నరసరావుపేట: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సంస్కరణలలో గతంలో ఉన్న స్లాబులన్నింటినీ మార్చి ప్రస్తుతం 5, 12 శాతం స్లాబులను అమల్లోకి తీసుకొచ్చాయని ఉమ్మడి గుంటూరు జిల్లా వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్–2 జాన్ స్టీవెన్‌సన్ పేర్కొన్నారు. శుక్రవారం వాణిజ్యపన్నులశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలియచేశారు. గతంలో ఉన్న ఐదుశాతం, 12, 18శాతం పన్నులు ఉన్న వస్తువులు జీరో స్థాయికి తీసుకొచ్చారన్నారు. 12, 18శాతంలో ఉన్న వస్తువులను చాలావరకు ఐదు శాతానికి తీసుకురావటం జరిగిందన్నారు. దీని వలన ప్రజలకు చాలా డబ్బు ఆదా అవుతుందని, మన రాష్ట్ర పరిస్థితి గమనిస్తే ఏడాదికి రూ.8వేల కోట్లు ప్రజలకు ఆదా అవుతుందన్నారు. దీనిని ఇంటింటికి తీసుకెళ్లేందుకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 19వరకు అంటే దసరా నుంచి దీపావళి వరకు ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. నిత్యావసరాలు, రాగి, స్టీలు, ఇత్తడి పాత్రలు, విద్యార్ధులు వాడే నోట్‌బుక్‌లు, పెన్నులు, కార్లు, కళ్లద్దాలు, మోటార్‌బైక్‌లు తదితర వస్తువులు రేట్లు తగ్గాయన్నారు. ప్రజలకు మిగిలే రూ.8వేల కోట్లతో మళ్లీ వారు కొనుగోలు చేయటం వలన ప్రభుత్వానికి ఇంకా పన్నులు లభించే అవకాశం ఉందన్నారు. దీని అమలు కోసం స్థానిక కార్యాలయంలో ఒక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామన్నారు. షాపులు, పెద్దమాల్స్‌లో బోర్డులు ఏర్పాటుచేయాలని సూ చించామన్నారు. బోర్డులు ఏర్పాటుచేయని వా రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యా పారస్తులకు తమ సహకారం ఉంటుందన్నా రు. వ్యాపారులు కూడా తమకు సహకరించా లని కోరారు. నరసరావుపేట అసిస్టెంట్ కమిషనర్లు రంగయ్య, రామారావు పాల్గొన్నారు.