
మహాలక్ష్మీ సేవలో గవర్నర్లు..
మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్‌లు సాదరంగా స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. వేద ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలు, చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులను ఈవో శీనానాయక్ స్వాగతం పలుకగా.. అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.