
ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు
పిడుగురాళ్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో
కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళలు
గణపవరం కోదండరామాలయంలో
రూ.2 లక్షల నోట్లతో అలంకారం
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని శృంగేరీ శ్రీశారదాంబ దేవాలయంలో అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మి అలంకారం గావించారు. రూ. 21.5 లక్షలు విలువైన కరెన్సీ నోట్లతో విశేష అలంకారం చేశారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్‌లోని శ్రీవాసి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రూ.10 లక్షల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో పార్వతి అమ్మవారిని కరెన్సీ నోట్లతో మహాలక్ష్మిగా అలంకరించారు.
–చిలకలూరిపేట/వినుకొండ/బొల్లాపల్లి/పిడుగురాళ్ల
కరెన్సీ నోట్ల అలంకారంలో
శృంగేరీ శ్రీ శారదాంబ
వినుకొండలో రూ.10 లక్షల
కరెన్సీ నోట్లతో అలంకరణ

ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు

ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు

ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు

ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు