
బాలకృష్ణను చీదరించుకుంటున్న ప్రజలు
సత్తెనపల్లి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీలో అవమానపరిచే విధంగా మాట్లాడిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. డాక్టర్ సుధీర్‌భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, బాలకృష్ణ మాత్రం వైఎస్ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సైకో అంటూ పదేపదే అంటున్న బాలకృష్ణ సైకో ఇజం గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. తన ఇంట్లో జరిగిన కాల్పుల కేసు నుంచి బయటపడేందుకు బాలకృష్ణ తనకు మెంటల్ ఉందని సర్టిఫికెట్ తెచ్చుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చులకనగా మాట్లాడటం బాలకృష్ణకు తగదన్నారు. బాలకృష్ణ పిచ్చివాగుడును చూసి ప్రజలే చీదరించుకుంటున్నారన్నారు. మరోసారి ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూల నాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త డాక్టర్ సుదీర్ భార్గవ్ రెడ్డి