
పల్లెల్లో పడకేసిన
పారిశుద్ధ్య పనులు
దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల ప్రాంతాల్లో గతేడాది అతిసారం ప్రబలి ప్రాణాలు వదిలారు. వందలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. నగరపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది శివారు కాలనీల్లో మురుగు సమస్యను పట్టించుకోకపోవడంతో తాగునీరు కలుషితమై అతిసారం ప్రబలింది. ప్రస్తుతం వర్షాలు అధికంగా నమోదై కాలనీల్లో మురుగు నిల్వ ఉంటోంది. రోడ్లు, ఇళ్ల మధ్య మురుగు కదలడం లేదు. దీంతో దోమల వృద్ధి పెరిగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. గతేడాది చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్న అధికార యంత్రాంగంలో చలనం లేదని ప్రజలు వాపోతున్నారు. పక్కనే ఉన్న గుంటూరులో డయేరి యా కేసులు రోజురోజుకు పెరిగి ప్రమా దకరంగా మారుతున్న తరుణంలో జిల్లాలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముంది. ఆ పరిస్థితి రాకముందే ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలలో తూతూమంత్రంగా ఫాగింగ్ యంత్రాలతో దోమల మందు పిచికారీ చేయిస్తున్నారు. మరికొన్ని పంచాయతీలలో ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురై మూలనపడ్డా యి. ఫాగింగ్ యంత్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ప్రజలకు తాగునీరు కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. తమకు తాగునీరు సరఫరా చేయడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని దాచేపల్లి నగర పంచాయతీ వాసులు అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పల్లెల్లో పడకేసిన