
బాలకృష్ణ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: సినీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పూర్వాపరాలను మరిచిపోయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొ న్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాడు సినీ నటులు అందరూ కలిసి తెలుగు ఇండస్ట్రీ సమస్యపై వైఎస్ జగన్ ఇంటికి వస్తే వారందరినీ సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసి గౌరవించారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని బాలకృష్ణ మభ్యపెట్టి చేసిన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చూస్తే అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
గురజాల:మెడికల్ కళాశాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నీ అబద్ధాలు, తప్పుడు లెక్కలు చెప్పాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గురజాలలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాల విషయంలో వైఎస్సా ర్ సీపీ నాయకులు, కార్యకర్తలు సెల్ఫీ చాలెంజ్‌లతోపాటు పలు పోరాటాలు చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ హయాంలో 28 శాతం పనులు మాత్రమే జరిగాయని పచ్చి అబద్ధమాడాడన్నారు. యరపతినేని లెక్కల్లో వీక్ అని ఆరోపించారు. లెక్కలు నేర్చుకొమ్మని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు లెక్కలు వేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2020–21లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు భూమికొనుగోలుకు రూ.15 కోట్లు, 2021–22లో రూ.37 కోట్లు, 2022–23లో రూ.87కోట్లు, 2023–24లో రూ.55కోట్లు, 2024–25లో రూ.46కోట్లు, 2025 ఏప్రియల్ వరకు రూ.10 కోట్లు అంటే సుమారుగా రూ.250 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం జూన్ నెల నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మేము నోటిమాటలతో లెక్కలు చెప్పడం లేదని చెప్తున్నామన్నారు. 60శాతం పనులు వైఎస్సార్ సీపీ హ యాంలో పూర్తి చేశామన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేద న్నారు. యెనుముల మురళీధర్‌రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), కె.బుజ్జి, అన్నారావు ఉన్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనం