
అగ్రగామిగా నిలిస్తే రూ.కోటి నజరానా
సత్తెనపల్లి: తొమ్మిది అంశాల్లో పురోగతి సాధించిన గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.కోటి బహుమతి ఇవ్వనుంది. ప్రస్తుతం జిల్లాలో చాలా పంచాయతీల్లో కనీస సౌకర్యాల కొరత వేధిస్తోంది. తాగునీటితోపాటు మురుగు కాలువలు, రహదారులు, ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దీన్ని అధిగమించడానికి గ్రామ పంచాయతీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సూచికలో పొందుపరిచింది. డిసెంబర్‌లో పురోగతి సూచిక ప్రగతిని గుర్తించి ఎంపికై న గ్రామ పంచాయతీలను ప్రకటిస్తారు.
ప్రగతిపథంలో నడిచేలా...
జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందు కోసం గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తొమ్మిది అంశాలు ఇవి...
●గ్రామపంచాయతీలో పేదరికం లేని
జీవనోపాధిని పెంపొందించడం
●ప్రజారోగ్యం, గ్రామ శ్రేయస్సును మెరుగుపరిచే
కార్యక్రమాలు
●ప్రజలకు స్వచ్ఛమైన నీరు పుష్కలంగా
అందుబాటులోకి తేవడం
●పిల్లల సంరక్షణ, అభివృద్ధికి అనుకూలమైన
వాతావరణం కల్పించడం
●గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో
తీర్చిదిద్దడం
●మౌలిక సదుపాయాల కల్పన
●సామాజిక న్యాయాన్ని సురక్షిత వాతావరణంలో
నెలకొల్పడం
●శాంతియుతమైన, న్యాయమైన, బలమైన
సంస్థలతో సుపరిపాలన
●పంచాయతీ సమగ్ర అభివృద్ధి, మౌలిక
సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలు.
పంచాయతీలకు
కేంద్ర ప్రభుత్వం వరం