
జాతీయ రహదారుల పనులు సత్వరమే పూర్తిచేయండి
నరసరావుపేట: జిల్లాలో నేషనల్ హైవేస్ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణాలకు కావాల్సిన పనులన్ని అధికారులు సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించా రు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ హైవేస్‌పై సమీక్షకు అధ్యక్షత వహించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారి వినుకొండ నుంచి గుంటూరు వర కు 85.30 కిలోమీటర్ల పొడవున రెండు లేన్ల రహదారిని నాలుగు వరుసల రహదారి విస్తరణకు 544డి ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. ఈ అలైన్‌మెంట్ పల్నాడు జిల్లాలో 53.91 కి.మీ, బాపట్ల జిల్లాలో 13.8 కి.మీ, గుంటూరు జిల్లా 18.19 కి.మీ ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ కోసం మొత్తం 344.31 హెక్టార్ల భూమి అవసరం కాగా ప్రస్తు తం భూమి సేకరణ ప్రక్రియ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కొనసాగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు తాత్కాలిక అంచనా వ్యయం రూ.2605 కోట్లు ఖర్చు అవుతుందని డీఇపీ పార్వతీశం పేర్కొ న్నారు. పనులన్నీ త్వరితగతిన పూర్తిచే యా లని కలెక్టర్ సూచించారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్‌ఓ ఏకా మురళి, నరసరావుపేట, సత్తెనపల్లి ఆర్డీవోలు కె.మధులత, రమాకాంతరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కారెంపూడి: మార్టూరు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రెండు గ్రానైట్ లోడు లారీలను కారెంపూడి ఎస్‌ఐ వాసు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పన్ను కట్టకుండా గ్రానైట్ తరలిపోతుందని పోలీసులు వాహనాలను ఆపారు. అనంతరం సేల్స్‌టాక్స్, మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైవేస్ నిర్మాణాలపై సమీక్ష చేసిన
జిల్లా కలెక్టర్