డాక్టర్‌ సునీల్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సునీల్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు

Sep 22 2025 7:12 AM | Updated on Sep 22 2025 7:12 AM

డాక్ట

డాక్టర్‌ సునీల్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు

డాక్టర్‌ సునీల్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు సమష్టి కృషితో డివిజన్‌లో అద్భుతమైన పురోగతి కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ పెంట్యాల సునీల్‌కుమార్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నేత్ర వైద్యుల సంఘం అవార్డు వరించింది. సోషల్‌ మీడియాలో ‘టిప్‌ ఆఫ్‌ ది డే’ ద్వారా నేత్ర వైద్య మెలకువలను ప్రజలకు వివరిస్తున్నందుకుగానూ గుంటూరులో ఆదివారం జరిగిన రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సులో ఈ అవార్డును సునీల్‌కుమార్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. తనను ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డాక్టర్‌ సునీల్‌కుమార్‌ను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.

రైల్వే డివిజన్‌ పీఆర్‌ఓ డి.వినయ్‌కాంత్‌

లక్ష్మీపురం: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా గుంటూరు రైల్వే డివిజన్‌ అద్భుతమైన పురోగతి సాధిస్తుందని గుంటూరు రైల్వే డివిజన్‌ పీఆర్‌ఓ డి.వినయ్‌కాంత్‌ తెలిపారు. ఆదివారం గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఈ ఏడాది సాధించిన విజయాలు, అభివృద్ధి వివరాలు వెల్లడించారు. 3.809 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా రూ.712 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గతేడాది కంటే 6.1 శాతం ఎక్కువ అని తెలిపారు. నడికుడి–శ్రీకాళహస్తి లైను 309 కిలోమీటర్లు కాగా ఇప్పటి వరకు 90 కి.మీ పూర్తయిందన్నారు. ఎర్రుబాలెం–నంబూరు (56.53 కి.మీ) లైను ఏపీ రాజధాని అమరావతిని కలుపుతుందని, భూసేకరణ పురోగతిలో ఉందన్నారు. నల్లపాడు–నంద్యాల 12 కి.మీ పూర్తయిందని తెలిపారు. నవంబర్‌ 2025 నాటికి గురజాల–నంద్యాల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, డిసెంబర్‌ 2026 నాటికి దిగువమెట్ట–గురజాల (40 కి.మీ) పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నల్లపాడు–పిడుగురాళ్ల 30 కి.మీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. డివిజన్‌ పరిధిలో 16 రైల్వేస్టేషన్‌లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ల పునరాభివృద్ధి కోసం రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేశారు.

కొల్లూరు : కృష్ణా నదీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి, నది అంచుల వద్ద పొదల్లో తేలింది. ఆదివారం ఉదయం మండలంలోని ఈపూరులంకలో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు నది ఒడ్డు వెంబడి 60 సంవత్సరాల వరకు ఉన్న ఓ పురుషుడి మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లారు. రెండు రోజుల కిందట విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నదిలోకి దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహం అయి ఉండవచ్చన్న అనుమానంతో కొల్లూరు పోలీసులు తాడేపల్లి, విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మృతదేహం విజయవాడ వద్ద నదిలో దూకిన వ్యక్తిది కాదని అతని బంధువులు నిర్ధారించారు. నది ఒడ్డున పొదల్లో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లభించలేదు. బట్టతలతో, లేత గోధుమ రంగు చొక్కా, బ్లూ ప్యాంట్‌ ధరించి, చేతికి ఎర్రని దారంతో ఆంజనేయ స్వామి లాకెట్‌ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం శవాగారంలో భద్రపరచనున్నట్లు ఎస్‌ఐ జానకీ అమర్‌వర్ధన్‌ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు.

డాక్టర్‌ సునీల్‌కు  ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు  1
1/1

డాక్టర్‌ సునీల్‌కు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఏపీ’ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement