
పోలీసు నిర్బంధం
పిడుగురాళ్ల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో, పోలీస్‌స్టేషన్ వద్ద, ఖలీల్ దాబా వద్ద ఉన్న బైపాస్ రోడ్డులో, బ్రాహ్మణపల్లి బైపాస్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కారులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా సుమారు 300 మంది మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. వారిలో 50 మందిని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 250 మందిని పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో నిర్బంధించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు వైద్య కళాశాలకు వచ్చే వారిని కవరేజ్ కోసం సాక్షి మీడియా బృందం విధులు నిర్వహిస్తుంటే అక్కడ కూడా పోలీసులు వీడియోలు, ఫొటోలు తీయనివ్వకుండా ఆంక్షలు విధించారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా విలేకరులు పోలీస్‌స్టేషన్ బయట నుంచి అదుపులోకి తీసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఫొటోలు తీస్తే పోలీసులు దౌర్జన్యంగా ఫొటోలను డిలీట్ చేయాలని హుకుం జారీ చేశారు. అక్కడికి చేయని పక్షంలో చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని పోలీసులే తీసిన ఫొటోలను, వీడియోలను డిలీట్ చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారిని తిరిగి గ్రామాలకు వెనుదిరిగాలని లేనిపక్షంలో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని చెప్పి కొందరిని వెనుదిరిగేలా చేశారు.
నాయకుల హౌస్ అరెస్టు
పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్‌తోపాటు కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రునిరామిరెడ్డి, గురజాల నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సాంబశివరావుతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను పట్టణ పోలీసులు హౌస్ అరెస్టు చేసి అడ్డుకున్నారు. అరెస్టు అయిన వారిలో గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చల్లా పిచ్చిరెడ్డి, గురజాల నియోజకవర్గ మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ జైలాబ్దిన్, కౌన్సిలర్ కొక్కెర శ్రీను, పాశం వెంకటేశ్వరరెడ్డి(చిన్నోడు), జిల్లా యువజన విభాగ ఉపాధక్షులు జబీర్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఇల్లూరి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరారెడ్డి, కరాలపాడు సర్పంచ్ చల్లా శివారెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు శెట్టుపల్లి పూర్ణ, కామేపల్లి సర్పంచ్ ముప్పూరి వెంకటప్పయ్య, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ పిచ్చిరెడ్డి, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ షేక్‌మాబు, మాజీ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ ముడేల వెంకటేశ్వరరెడ్డి, ఎన్‌డీఎల్, పిడుగురాళ్ల పట్టణ ఉపాధ్యక్షులు కందులూరి శివయ్య, చల్లా ఆవులయ్య, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు చింతల జానకిరామయ్య, శివరాత్రి నారాయణ, కానాల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ షేక్ సలాంతోపాటు యువజన, విద్యార్థి విభాగ నాయకులు ఉన్నారు.
చలో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కార్యక్రమం విజయవంతం