
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హౌస్ అరెస్టు
పెదకూరపాడు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును శుక్రవారం తెల్లవారుజామున క్రోసూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని అక్కడకి వెళ్లకూడదు అంటూ క్రోసూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకరరావుకి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అన్నారు. ప్రైవేటీకరణ నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే పోలీసులు హౌస్‌అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించా రు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.