
విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
నరసరావుపేట ఈస్ట్: అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర గర్‌ల్స్ కన్వీనర్ లింగిశెట్టి బాలనవ్యశ్రీ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో 77, 107, 108 జీఓలను రద్దు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా జీఓల రద్దు మాట అటుంచి వైద్యవిద్యను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. ప్రైవేటు పరం చేయటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాసరి హేమంత్‌కుమార్, ఎం.మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి, యువజన విభాగాల నేతలపై కేసు నమోదు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని చలో ప్రభు త్వం మెడికల్ కళాశాలను సందర్శించేందుకు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వ ర్యంలో గుంటూరు నుంచి వస్తున్న నాయకులను సత్తెనపల్లిలో పోలీసులు శుక్రవారం అడ్డుకున్నా రు. తాము శాంతియుతంగా వెళుతున్నప్పటికీ పోలీసులు వాహనాలను నిలిపివేసి పూర్తిగా అడ్డుకోవడంతో ఆయా విభాగాల నాయకులు, విద్యార్థులు పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించారని 7వ సచివాలయ గ్రామ రెవెన్యూ అధికారిణి చిరుమామిళ్ల అరుణ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ జే.శ్రీనివాసరావు 10 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. వారిలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షు డు పానుగంటి చైతన్య, యువజన విభాగం గుంటూరు, కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ కళ్లం హరికృష్ణారెడ్డి, ఆయా విభాగాల నాయకులు పులగం సందీప్‌రెడ్డి, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, చిన్నాబత్తిన వినోద్‌కుమార్, పేటేటి నవీన్‌కుమార్, షేక్ సుభాని, వై కోటేశ్వరరావు, బీ.రవీంద్ర, కోనూరి శశిధర్ లపై కేసు నమోదు చేసి నోటీసులు అందించారు.