
చలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను అడ్డుకునేందుకు కుట్ర
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఛలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కార్యక్రమానికి నాయకులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డిని నరసరావుపేటలో గురువారంరాత్రి హౌస్ అరెస్ట్ చేసి శుక్రవారం కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి భర్త చల్లంచర్ల సాంబశివరావు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అచ్యుత శివప్రసాద్ ఇళ్లకు తెల్లవారుజామున పట్టణ పోలీసులు వెళ్లి హౌస్ అరెస్ట్ చేసి బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి, వైద్య విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ముక్తార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ మౌలాలి, సత్తెనపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు కొమెర శివశంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు వేర్వేరు మార్గాల ద్వారా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలను సందర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.
సమన్వయకర్త సుధీర్ భార్గవ్‌రెడ్డితోపాటు ఇరువురు నాయకులు హౌస్ అరెస్ట్
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
ఆధ్వర్యంలో తరలిన నేతలు