
రైలు కింద పడి వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: గుర్తు తెలియని వ్యక్తి మాచర్ల, గుంటూరు ప్యాసింజర్ రైలు కింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులోని రైల్వే గేటు సమీపంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు...గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనటంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 42 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు ఎర్ర రంగు చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని, మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.