
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో పలువురికి చోటు
నరసరావుపేట / సత్తెనపల్లి : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నలుగురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ ఎస్టీ సెల్ సెక్రటరీగా రమావత్ జనపల్ నాయక్(మాచర్ల), స్టేట్ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా వెన్నా నరసింహారెడ్డి (గురజాల), స్టేట్ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులుగా జూలకంటి శ్రీనివాసరావు (గురజాల), స్టేట్ వాణిజ్య విభాగ కార్యదర్శిగా అచ్యుత శివప్రసాద్ (సత్తెనపల్లి) నియమితులయ్యారు. అచ్యుత శివప్రసాద్ గతంలో వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. తన నియామకానికి సహకరించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.