
మీడియా స్వేచ్ఛను హరించాలనుకోవడం సిగ్గుచేటు
ప్రశ్నించే హక్కు, తప్పొప్పులను వెలికితీసే హక్కు సమాజంలో మీడియాకు ఉంది. వారి హక్కులను, స్వేచ్ఛను హరించేలా వ్యవహరిండం సిగ్గుచేటు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు పలువురు జర్నలిస్టులపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో పిలవడం మంచిది కాదు. ఏమైనా లోపాలుంటే వివరణ ఇస్తే సరిపోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిది.
– నందిగం సురేష్, మాజీ ఎంపీ, బాపట్ల