
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సాక్షిపై కూటమి సర్కారు అక్కసు వెళ్లగక్కుతుంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే సాక్షిని నోరు మూయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘ఇస్ ద ప్రెస్ ఇన్ ద హ్యాండ్.. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద గ్రేట్ మాన్’ అనే మాటలు చంద్రబాబు, లోకేష్‌ల విషయంలో నిజమయ్యాయి. దివంగత ఎన్టీఆర్‌కు ఉన్న ప్రజాబలం చంద్రబాబు, లోకేష్‌లకు లేనప్పటికీ పచ్చ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వారిని నాయకులుగా చేశాయి. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సరికాదని చెబుతున్నందుకు సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు. సిబ్బందిని ఇబ్బందులు గురిచేయడం సరికాదు. తప్పులు సరిచేసుకోకుండా కక్ష సాధింపు సిగ్గుచేటు. అసత్యాలు, అసందర్భాలపై నిరంతర పోరాటం చేసే సాక్షిని ఆపటం ఎవరి తరం కాదు. అక్రమ కేసులు, అరెస్టులు చేసినంత మాత్రాన నిజాయితీగా కలం చేతబట్టిన జర్నలిస్టులను ఆపలేరు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు వాస్తవాలను వెల్లడించే ధైర్యం వారికి ఉంది. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ

శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025