
జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికలు
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ సోమవారం జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గల వివిధ పాఠశాలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 32మంది క్రీడాకారులను ఉమ్మడి గుంటూరు జిల్లా టీంకు ఎంపిక చేశారు. వారిలో బాలుర నుంచి 16 మంది, బాలికల నుంచి 16మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెలలో వైజాగ్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పీసీ కమిటీ చైర్మన్ ఏడుకొండలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను విశ్రాంత హెచ్‌ఎం ఎన్. రామకష్ణారెడ్డి, హెచ్‌ఎం బీఎం సుభాని, వ్యాయామ ఉపాధ్యాయుడు సైదయ్య అభినందించారు.

జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికలు