
సచివాలయ ఉద్యోగుల నిరసన
సత్తెనపల్లి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్యకు కారణమవుతున్న వలంటీర్ విధులను బహిష్కరిస్తూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైఠాయించి శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు చిలుక ప్రదీప్ మాట్లాడుతూ గతంలో వలంటీర్లను క్లస్టర్లుగా విభజించి వారి సేవలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థ లేనందున ఆ సేవలను సచివాలయ ఉద్యోగుల చేత చేయించటం సరైనది కాదన్నారు. వలంటీర్ల విధులను తామెందుకు నిర్వహించాలని, తక్షణమే ఆ సేవలను సచివాలయ ఉద్యోగులకు కేటాయించటం మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సెక్రటరీ గౌతమి, మహిళా పోలీసులు జిల్లా ప్రెసిడెంట్ దామర్ల నలిని, తిరుమల లక్ష్మి గౌరవ సలహాదారుడు జి. రవిరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బూరే సైదా, జిల్లా అధ్యక్షుడు బి. కొండలరావు, సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు.