డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి
నరసరావుపేటటౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏరియా వైద్యశాలలో క్షయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి మాట్లాడుతూ టీబీ అంటు వ్యాధి అన్నారు. టీబీకి ప్రస్తుతం చాలా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండు వారాల పాటు దగ్గు, జలుబు ఉండి తగ్గకపోతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్యశాల్లో సంప్రదించాలన్నారు. టీబీ ఉన్నట్లు నిర్థారణ అయితే ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో 1500 కేసులు ఉన్నాయన్నారు. పోషణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి నెలా పౌష్టికాహారం కూడా అందజేస్తున్నామన్నారు. డెప్యూటీ డీఎంచ్‌హెచ్‌ఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు.