
పల్నాడు కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. వివిధ సమస్యలతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. వీరు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. దీంతోపాటు ఎనిమిది మొబైల్ టాయిలెట్లు నిర్మించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్యతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో అడుగు పెడితే అక్కడి పరిసరాలు, సౌకర్యాలు, కళారూపాలు చూశాక మనసు ఆహ్లాదంతో పులకిస్తోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్గత రోడ్లనూ అందంగా తీర్చిదిద్దారు. విభాగాల చిరునామాలు తెలిపేలా ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు.