కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీణిపతి తీరుతో విద్యార్థుల జీవితం అధకారంగా మరుతుందని అధికార బీజేపీ మండిపడింది. ఆదివారం జయపూర్‌లో పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌతం శాంత్ర ప్రసంగించారు. బాహీణిపతి నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను తీవ్రంగా ఖండించారు. వీడీ యునివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని అంగీకరించారన్నారు. ఇది లింగ్డో కమిషన్‌కి వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ అభ్యర్థులు పోటీ చేసే అర్హత కోల్పోతారన్నారు. అంతేకాక రూ.20 కోట్ల నిధుల విడుదలపై ఎమ్మెల్యే మాట్లాడటాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఓటర్లని డబ్బుతో లోబరుచుకోవడం వంటిదన్నారు. తన ముఖం చూసి ఓటు వేయమనడం కూడా లింగ్డో కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. విశ్వ విద్యాలయంలో ఎమ్మెల్యే రాజకీయాలు చేయడం అవమానకరమన్నారు. విద్యార్థి సంఘ ఎన్నికలకు రాజకీయ పార్టీల రంగు పులమడం పట్ల గౌతం శాంత్ర మండిపడ్డారు.


