మానసిక ఆరోగ్యంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మానసిక ఆరోగ్యంపై అవగాహన

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

రాయగడ: మానసిక ఆరోగ్య సమస్యలపై సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు బాధితులకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు, చట్టపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. గుణుపూర్‌ తాలూకా న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో న్యాయ, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మానసిక ఆరోగ్యం ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమానికి గుణపూర్‌ అదనపు జిల్లా న్యాయమూర్తి దేవదత్త పట్నాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా గుణుపూర్‌ ఎస్‌డీజేఎం విజయలక్ష్మీ మహాపాత్రో, రామనగుడ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్‌ అభిషేక్‌ పట్నాయక్‌, సమితి అభివృద్ధి అధికారి ప్రద్యుమ్న మండల్‌, తహసీల్దార్‌ ప్రాణకృష్ణ పాణిగ్రహి, రామనగుడ పోలీస్‌ స్టేషన్‌ అధికారి కిరణ్‌ బాల సామల్‌లు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్య సహాయం పొందాలని వక్తలు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement