రాయగడ: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను వాటి అసలు యజమానులకు తిరిగి అందజేసేందుకు ఆదివారం నాడు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ డిస్ట్రిబ్యూషన్ మేళా–2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ రాజ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని,పోలీసులు స్వాధీనం చేసుకున్న వందకు పైగా మొబైల్ ఫోన్లను వాటి అసలు యజమానులకు స్వయంగా అందజేశారు.
కలకలం రేపిన ఇస్రో పరికరం
భువనేశ్వర్: బాలేశ్వర్ జిల్లా నీలగిరి మండలం గెండ్రాడి–నారాయణపూర్ పంచాయతీ పరిధిలో ఆకా శం నుంచి పడిన ఓ లోహపు పెట్టె కలకలం రేపింది. బాంబు అనుకుని భయపడిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా అది ఇస్రోకు చెందిన వాతావరణ పరిశోధన పరికరంగా గుర్తించా రు. గెండ్రాడి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో తీగలకు వేలాడుతున్న ఈ పెట్టైపె పీ0086 గుర్తింపు సంఖ్య ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దానిని సురక్షితంగా కిందకు దించి పరిశీలించగా అందులో యాంటెన్నా, ట్రాన్స్‌మీ టర్ ఉన్నట్లు గుర్తించారు. ట్రాన్స్‌మీటర్‌పై ఉన్న సంప్రదింపు నంబరు ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు నేమి చంద్, రాహుల్ శివగోత్రాలను పోలీసులు సంప్రదించారు. బెలూన్ గాలిలో పేలిపోవడంతో పరికరం కిందపడినట్లు వారు తెలిపారు.


